పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలన్న దళితులను అగ్రవర్ణ కుటుంబాలు సాంఘికంగా బహిష్కరించడాన్ని కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం ఖండించారు. అక్కడ జరుగుతన్న విషయాలను ఆయన ఈ రోజు ఒక ఉత్తరం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని ఇంకా సందర్శించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

