చంద్రబాబు రాజకీయాల ఉచ్చులో పడవద్దని జన సేన నాయకుడు పవన్ కల్యాణ్ కు కాపు రిజర్వేషన్ పోరాటనాయకుడు ముద్రగడ సలహా
ముఖ్య మంత్రి చంద్రబాబు ఉచ్చులో పడవద్దని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ పద్మనాభం హితవు చెప్పారు.
ఈ మేరకు ఆయన జనసేనానికి ఒక లే ఖ రాశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు కుమ్మరించి కాపులను మోసగించిన వైనాన్ని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే ఎన్నో వర్గాల వారికి హామీల వర్షం కుమ్మరించారు. ఈ హామీలన్ని నీటి మీద రాతల్లాగే ఉన్నాయన్న విషయం గమనించాలని ఆయన పవన్ ను కోరారు. ’అటువంటి అబద్దాలను నిజమని నమ్మి, మీరు వారితో ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోవద్దని కోరుచున్నానండి,’అని ముద్రగడ జనసేన నాయకుడికి విజ్ఞప్తి చేశారు. లేఖ ఇది.

