ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ పై భారత మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ కోర్టులో దావా వేశారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సంస్థకు ధోని కోర్టుకు ఈడ్చాడు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినప్పటి సుమారు రూ.150 కోట్ల బకాయిలను చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల తనకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చూడాలని లేదంటే సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ధోని కోరారు.

 కొన్ని సంవత్సరాల పాటు మహేంద్రసింగ్ ధోనీ ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారు. ఆయితే ఈ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించలేదు. ఆమ్రపాలి సంస్థతో ధోనీ 2016 లోనే  ప్రచారకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుండి  ఇప్పటివరకు కూడా ఈ సంస్థ చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని ధోనీ  బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలను చూసుకునే రితీ స్పోర్ట్స్  ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలు చేసింది. అలాగే భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌ల బార్కెటింగ్ కార్యకలాపాలను కూడా రితీ స్పోర్ట్స్ సంస్థే  చూసుకుంటోంది. ఇలా వీరందరికి సంబంధించిన దాదాపు రూ.200 కోట్ల వరకు తమకు ఆమ్రపాలి సంస్థ బకాయి పడ్డట్లు రితీ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే వెల్లడించారు.