‘ట్యూట్ల్ లైట్’ టికెట్లు అమ్మి తిట్లు తిన్న మధ్యప్రదేశ్ మంత్రి

MP minister Gopal Bhargava sells Tubelight movie tickets attracts netizens wrath
Highlights

మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు తన సొంత సినిమా థియేటర్లో టికెట్లు అమ్ముతూ ఫొటోలకు ఫోజులిచ్చిన విషయం సంచలనం సృష్టించింది. ఆయన అమ్మింది తన సొంత ధియోటర్లోనే. మంత్రి హోదా లో ఉంటూ ఇలా చిన్న ఉద్యోగులు చేయాల్సిన పని చేయడం విశేషం. అయితే, ఇది పెద్ద విమర్శకు తావిచ్చింది. ఓవైపు రైతులు పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పుడుతుంటే వాళ్లను పరామర్శించేందుకు ఈ మంత్రికి టైం లేదా అని నెటిజన్లు మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు తన సొంత సినిమా థియేటర్లో టికెట్లు అమ్ముతూ ఫొటోలకు ఫోజులిచ్చిన విషయం సంచలనం సృష్టించింది. ఆయన అమ్మింది తన సొంత ధియోటర్లోనే. ఒక విధంగా ఇది సింపుల్ విషయం.మంత్రి హోదా లో ఉంటూ ఇలా చిన్న ఉద్యోగులచేయాల్సిన పని చేయడం విశేషం. అయితే, ఇది పెద్ద విమర్శకు తావిచ్చింది. ఓవైపు రైతులు తమ పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పుడుతుంటే వాళ్లను పరామర్శించేందుకు టైం లేదు. సినిమా ధియోటర్ కౌంటర్ లో  కూర్చుని టికెట్లు తీరు బడి గా ఎలా అమ్ముతాడని మీడియా ఒక వైపు,  ప్రతిపక్ష పార్టీలు మరొకవైపు మంత్రి గోపాల్ భార్గవను ఏకిపారేస్తున్నారు.

 

ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కి చాలా గొడవ గొడవ అయింది. 

 

మధ్యప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ శుక్రవారం విడుదలైన సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం‘ట్యూబ్ లైట్’టికెట్లు అమ్ముతూ కౌంటర్ లో కనిపించారు. 

 

ఈ సమయంలో అభిమానులు కొందరు కౌంటర్ లో మంత్రి ని గురించారు., ఫోటోలు తీశారు. వీడియో లు తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. షేర్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో  ఒకటే రభస

 

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని పరామర్శించాల్సిందిపోయి సినిమా టిక్కట్లు అమ్ముకుంటూ కూర్చున్నాడంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నొంచారు.

ఈ మంత్రికి బుద్దిచెప్పాలంటూ మండి పడ్డారు.

loader