Asianet News TeluguAsianet News Telugu

ఊపందుకుంటున్న కవిత ‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ క్యాంపెయిన్ (వీడియో)

  • రోడ్డ ప్రమాదాల మరణాలను నివారించేందుకు  నిజామాబాద్ టిఆర్ ఎస్  ఎంపీ  కవిత  'సిస్టర్స్4చేంజ్'  క్యాంపెయిన్ మొదలు పెట్టారు.
  • హెల్మెట్ పెట్టుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమం రాఖీ పండుగ నాడు హెల్మెట్ కానుకతో మొదలవుతుంది.
  • సైనానేహ్వాల్, గుత్తా జ్వాల, మితాలిరాజ్,  అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎంపీ కవితకు తమ మద్దతు ను ట్వీట్ ద్వారా తెలిపారు
MP kavitas sister for change campaign gains momentum

 

నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత  చేపట్టిన 'సిస్టర్స్4చేంజ్' కార్యక్రమానికి అన్ని వర్గాలు తమ మద్దతు తెలుపుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తమ మద్దతు ను తెలియజేస్తున్నారు. సైనానేహ్వాల్, గుత్తా జ్వాల, మితాలిరాజ్,  అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎంపీ కవితకు తమ మద్దతు ను ట్వీట్ ద్వారా తెలిపారు. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సిందియా కవితను అభినందించారు. తన మద్దతును తెలిపారు.

బుధవారం  కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్న అవినాశ్ కాలేజ్ విద్యార్థులు  'సిస్టర్స్4చేంజ్'  కార్యక్రమం ను వినూత్నమైన రీతిలో నిర్వహించారు. తమ తోటి విద్యార్థులకు హెల్మెట్ వాడకం ఆవశ్యకతను వివరించారు. అనంతరం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా హెల్మెట్ పెట్టుకోవాలి అని, రోడ్డు ప్రమాదం జరిగితే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది  అని టూవీలర్స్ నడిపేవారికి చెప్పారు. 4వీలర్స్ నడిపే వారు, అందులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. ఎంపి కవిత మాస్క్ లు ధరించిన స్టూడెంట్స్ 'వి సపోర్ట్ కవితక్క' అంటూ నినదించారు.ఈ రాఖీ పండుగకు తమ సోదరుల కు రాఖీ కట్టి హెల్మెట్ ని బహుమతి గా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు అవినాశ్ కాలేజి విద్యార్థినీలు. ఈ కార్యక్రమంలో అవినాశ్ కామర్స్ కాలేజి డైరెక్టర్ అవినాశ్,డైరెక్టర్ సంతోష్,  ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios