మోటోరోలా భారీ డిస్కౌంట్లు

First Published 25, Dec 2017, 1:44 PM IST
motorola cristmas sale big descounts on smartphone
Highlights
  • భారీ ఆఫర్లు ప్రకటించిన మోటోరోలా

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మోటోరోలా.. భారీ ఆఫర్ ప్రకటించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కంపెనీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోటో జెడ్2ఫ్లే, మోటో జీ5ఎస్, మోటో ఎం, మోటో జీ5, మోటో ఈ4, మోటో సీ. ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అమలుకానున్నాయి.

ఆఫర్ల అనంతరం ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి..

మోటో జెడ్2 ప్లే.. అసలు ధర రూ.27,999కాగా.. డిస్కౌంట్ తర్వాత రూ.24,999కి లభిస్తోంది. మోటో జీ5ఎస్ ధర రూ.1000 తగ్గింది. ఈ ఆఫర్ ప్రకారం ఈ ఫోన్ రూ.12,999కే లభిస్తుంది. మోటో జీ5 ఫోన్ ధర కూడా రూ.1000 తగ్గింది. దీంతో రూ.8,999కే లభిస్తోంది. మోటో ఎం 4జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.2000 తగ్గింది. ప్రస్తుతం ఆఫర్ లో రూ.13,999కే లభిస్తోంది. అదేవిధంగా మోటో ఎం 3జీ స్మార్ట్ ఫోన్ రూ.11,999కే లభ్యం కానుంది. మోటో ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ పెట్టగా  ప్రస్తుతం దీని ధర రూ.5,999.

loader