మోటో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు
ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ మరోసారి ఆఫర్లు కురిపిస్తోంది.మోటరోలాకు చెందిన పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. మోటరోలా 45వ వార్షికోత్సవం సందర్భంగా మోటో ఫోన్ల ధరలను తగ్గించింది. మోటో జీ5, మోటో జీ5ప్లస్, మోటో జీ5ఎస్ ప్లస్, మోటో జడ్2 ప్లే మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్, ఈఎంఐ ఆఫర్లను సైతం అమెజాన్ అందిస్తోంది. ఏప్రిల్ 11దాకా ఈ సేల్ కొనసాగుతుందని సంస్థ వెల్లడించింది.
మోటో జీ5 మోడల్‌పై తగ్గింపు ప్రకటించడంతో గతంలో రూ.11,999గా ఉన్న ఫోన్ ఇప్పుడు రూ.8,420కి లభ్యం కానుంది. ఈ మోడల్‌లోని 32జీబీ వేరియంట్ ధరను దాదాపు 4వేలు తగ్గించి రూ.9999కి అందిస్తోంది. మోటో జీ5 ప్లస్ రూ.15,999 నుంచి రూ.9,990కి తగ్గింది. మరోవైపు మోటో జడ్2 ప్లే మోడల్‌పై సైతం భారీ స్థాయిలో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మోడల్‌ను రూ.27,999కి లాంఛ్ చేయగా ఇప్పుడు రూ.20,999కి లభ్యం కానుంది.
మరోవైపు ఎక్స్‌ఛేంజ్ చేసుకోదల్చినవారికి సైతం అమెజాన్ ఆఫర్లను అందిస్తోంది. ఆయా పాత హ్యండ్ సెట్లను బట్టి గరిష్ఠంగా రూ.12,398 విలువ అందించనుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీబ్యాంక్, తదితర బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
