ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లిమిటెడ్‌ ఎడిషన్‌గా మోటో జెడ్2 ఫోర్స్‌ పేరిట స్మార్ట్ ఫోన్ ని లాంచ్‌ చేసింది. భారత్‌లో దీని ధరను రూ.34,999గా కంపెనీ నిర్ణయించింది.  ఈ కొత్త  స్మార్ట్‌ ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తో పాటు మోటో హబ్ స్టోర్లలో గురువారం అర్ధరాత్రి  11.59 నిమిషాల నుంచి లభిస్తున్నాయి.  

మోటో జెడ్2 ఫోర్స్‌ ఫీచర్స్ 

5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 1440x2560  పిక్సెల్‌ రెజల్యూషన్‌, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 12+12ఎంపీ  డ్యుయల్‌  రియర్‌ కెమెరా విత్‌  ఎల్‌ఈడీ ఫ్లాష్, 5ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్,  2730 ఎంఏహెచ్ బ్యాటరీ ( టర్బో పవర్‌ ప్యాక్‌)