ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా.. తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. మోటోరోలా తన మోటో ఎక్స్4 స్మార్ట్‌ ఫోన్‌ను గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్‌ను 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేయగా ఇప్పుడు ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.24,999 గా ప్రకటించింది. ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్ లో ప్ర‌త్యేకంగా ల‌భిస్తున్న‌ది.

ఈ సంద‌ర్భంగా ఈ ఫోన్‌ను కొనే యూజ‌ర్ల‌కు ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్‌ ఛేంజ్ చేస్తే రూ.3వేల వ‌ర‌కు డిస్కౌంట్ వ‌స్తుంది. 

మోటో ఎక్స్ 4 ఫీచర్లు..

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే  

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్,

3/4/6 జీబీ ర్యామ్,

32/64 జీబీ స్టోరేజ్,

2జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,

12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

3000 ఎంఏహెచ్ బ్యాటరీ