ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మోటొరోలా తమ కంపెనీకి చెందిన పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మోటో జెడ్ 2 ప్లే, మోటో ఎక్స్ 4, మోటో ఈ4 ఫ్లస్, ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.  మోటో డేస్ సేల్ పేరిట ఫ్లిప్ కార్ట్ లో పెట్టిన ఈ  ఆఫర్ శనివారం ( ఫిబ్రవరి 24) తో ముగియనుంది.

గతేడాది జూన్లో మోటో నుంచి వచ్చిన ఫోన్ మోటో జెడ్ 2 ప్లే.  ఈ ఫోన్ ని తొలుత విడుదల చేసిన సమయంలో దీని ధర రూ.27,999 కాగా.. ఇప్పుడు దీనిపై రూ.5వేలు తగ్గించారు. అంటే ఈ ఫోన్ ఇప్పుడు రూ.22,999కే లభిస్తోంది. దీనికి ఎక్సేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. దాదాపు రూ.20వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చు.

మోటో ఎక్స్ 4 మార్కెట్ ధర రూ.22,999కాగా.. ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్ లో దీనిపై రూ.2వేలు తగ్గింపు ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.20,999 కే లభిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.19వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇక మోటో ఈ4 ప్లస్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.9,499 కాగా డిస్కౌంట్ ఆఫర్ లో రూ.9వేలకే లభిస్తోంది.