అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య .
కందుకూరుకు మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ(23) తన ఏడాదిన్నర పాప ఏడుస్తూ అల్లరిచేస్తుందని కొట్టింది. పొరపాటున ఆయువుపట్టైన కణతికి తగిలి పాప మరణించింది. భవ్యశ్రీ అత్తా మామలు చూస్తే తనను చంపేస్తారని బయపడింది. ఈ క్రమంలో తన కూతురు ఇక లేదన్న బాధతో లెటర్ రాసి చీరతో ఉరి వేసుకుని తాను కూడా తనువు చాలించింది. కాగా భవ్యశ్రీ చనిపోతూ రాసిన లెటర్ లో ' నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా పాప లేని జీవితం నాకవసరం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి' అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
