ఆస్తి కోసం కన్న కొడుకునే కడతేర్చిన కసాయి తల్లి

First Published 15, Apr 2018, 3:52 PM IST
mother killed her son in rajasthan
Highlights

ఆస్తి కోసం కన్న కొడుకునే  ఓ తల్లి హత్య చేయించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కొడుకు హత్యకు కిరాయి హంతకులకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి మరీ కొడుకును చంపించింది ఈ కసాయి తల్లి. ఈ ఘటన రాజస్థాన్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లాకు చోటీసద్రి గ్రామానికి చెందిన ప్రేమ్ లతా సతార్ అనే మహిళకు కొడుకు, కూతురు సంతానం. ఈమె భర్త కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుండి ఆస్తికోసం కొడుకు మోహిత్(21) వేధింపులు మొదలయ్యాయి. మద్యానికి, చెడు అలవాట్లకు బానిసైన మోహిత్ రోజూ గొడవచేస్తుండేవాడు. దీంతో విసుగుచెందిన లత కుమారుడి అడ్డు తొలగించుకోవాలనుకుంది. కొడుకును చంపడానికి   అల్లుడి సాయంతో కిరాయి హంతకుడైన ఓ దాబా యజమానితో లక్ష రూపాయకు బేరం కుదుర్చుకుంది. అడ్వాన్స్ గా రూ.50 వేలు, హత్య అనంతరం మరో రూ.50 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మోహిత్ తరచూ ఈ దాబాకే వెళ్తుండేవాడు. ఆలా దాబాకు వచ్చి భోజనం చేస్తున్న మోహిత్‌కు నిద్రమాత్రలను అన్నంలో కలిపి ఇచ్చారు. దీంతో మోహిత్ స్పృహ కోల్పోయాడు. అనంతరం గొంతు నులిమి మోహిత్‌ను హత్య చేశారు. 

ఈ కేసులో మోహిత్ తల్లిని, అక్క భర్తను, దాబా యజమానితో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

loader