బావిలో దూకి తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మహత్య

First Published 15, Dec 2017, 11:00 AM IST
mother and two childrens  suicide in nirmal district
Highlights
  • నిర్మల్ జిల్లాలో విషాదం
  • కుటుంబ కలహాలతో తల్లీ, పిల్లల ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కడెం మండలం బెల్లార్ పంచాయతీ పరిధిలోని పెరకపల్లి తాండలో వ్యవసాయ బావిలో దూకి తల్లి, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.  

పెరకపల్లిలో నివాసముంటున్న లక్ష్మి భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్లగా పిల్లలతో కలిసి అత్తమామల దగ్గర ఉంటోంది.  అయితే ఇవాళ లక్ష్మి తన ఇద్దరు
పిల్లలు శ్రీజ(7), సిద్ధు(5)లతో కలిసి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావినుంచి వెలుపలికి తీయించారు. ఈ ఆత్మహత్యలకు  
కుటుంబ కలహాలే కారణంగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

loader