ఈ లక్ష మంది రైతుల.. పాదయాత్ర దేనికోసం..?(వీడియో)

ఈ లక్ష మంది రైతుల.. పాదయాత్ర దేనికోసం..?(వీడియో)

ఈ ఫోటోలో ఎర్ర జెండాలు పట్టుకొని పాదయాత్ర చేస్తున్నవారంతా రైతులు. మహారాష్ట్రకు చెందిన ఈ రైతులంతా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాసిక్ నుంచి ముంబయికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం వీళ్లు కాసరఘాట్ .( ఈ వార్త రాస్తున్న సమయానికి కాసరఘాట్ లో ఉన్నారు. ఇది ముంబయికి రెండు గంటల ప్రయాణం) ప్రాంతానికి చేరుకున్నారు పంట రుణమాఫీ, విద్యుత్ బిల్లుల మాఫీ చేయాలని, పాల ధర పెంచాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, స్వామినాథన్ కమిషన్ ని అమలు పరచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులు ఈ యాత్రను మంగళవారం ప్రారంభించారు. మొత్తం 180కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అక్కడికి చేరుకొని ఆందోళన చేయాలని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1753మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినట్లు వారు చెబుతున్నారు.  రైతు రుణమాఫీ చేసి న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏఐకేఎస్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ దావ్లే తెలిపారు. అశోక్ దావ్లే, ఎమ్మెల్యే జేపీ గావిట్ నేతృత్యంలోనే రైతులు ఈ ర్యాలీ కొనసాగిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page