లాస్ వెగాస్ లోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో కాల్పులు  ది రూట్‌ 91 హార్వెస్ట్‌ కంట్రీ సంగీత కార్యక్రమంలోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

లాస్ వెగాస్ లోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 50మంది మృతి చెందగా.. 200మందికి పైగా గాయాలపాలయ్యారు. లాస్‌వెగాస్‌ స్ట్రిప్‌లో నిర్వహిస్తున్న ది రూట్‌ 91 హార్వెస్ట్‌ కంట్రీ సంగీత కార్యక్రమంలోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. కానీ, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తుపాకీ పేలుళ్ల చప్పుడు వినిపించడంతో అక్కడ ఉన్న వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగుతీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Scroll to load tweet…

కాల్పులకు తెగబడిన మరో దుండగుడు ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రదేశానికి ఎవరినీ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని మూసివేసి వాహనరాకపోకలను నిలిపివేశారు. తుపాకీలతో ఇద్దరు దుండగులు హోటల్‌లోని 32వ అంతస్తులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ఘటన కారణంగా ఇక్కడికి సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హైఅలర్ట్‌ ప్రకటించారు. పలు విమానాలను దారి మళ్లించారు.