కూలిన సైనిక విమానం... 100 మంది మృతి

First Published 11, Apr 2018, 3:46 PM IST
More than 100 killed in Algerian military plane crash
Highlights
200కి చేరనున్న మృతుల సంఖ్య

సైనిక విమానం కూలి 100మందికి పైగా మృతి చెందిన సంఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది. అల్జీర్స్‌లోని బౌఫారిక్‌ విమానాశ్రయం సమీపంలోనే విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య 200కి చేరే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలియజేస్తోంది. విమానం బెచర్‌ నగరానికి బయలుదేరగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడినట్లు స్థానిక మీడియా తెలిపింది. అత్యవసర సేవల సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.  దాదాపు 14 అంబులెన్స్ లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని వాటి సమాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మరణించిన వారి వివరాలపై స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

loader