16 రోజుల శిశువును ఇంట్లోంచి ఎత్తుకెళ్లిన కోతి

monkey kidnapped small baby at odisha
Highlights

అడవిలో పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన అధికారులు

16 రోజుల పసికందును ఓ కోతి  అడవిలోకి ఎత్తుకెళ్లిన విషాద సంఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇవాళ  తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పటినుండి అడవిలో శిశువు ఆచూకీ కోసం వెతుకుతున్నటికి ఇప్పటివరకు అభించలేదు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కటక్ జిల్లాలోని బంకి బ్లాక్‌లోని తలబస్తా గ్రామానికి చెందిన రామకృష్ట నాయక్ భార్య ఇటీవలే మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇంట్లో ఉక్కపోస్తుండటంతో రామకృష్ట తన 16 రోజుల వయసున్న కుమారుడిని తీసుకుని ఇంటిబయట వరండాలో పడుకున్నాడు. అయితే ఉదయం ఆరుగంటల సమయంలో ఎక్కడినుండి వచ్చందోగాని ఓ కోతి తండ్రి పక్కన పడుకున్న పసిగుడ్డును ఉత్తుకెళ్లింది. అయితే పిల్లాడిని కోతి ఎత్తుకెళ్లడాన్ని నాయక్ భార్య  గుర్తించి దాన్ని వెంబడించింది. అయినా ఈ కోతి ఆమెకె దొరక్కుండా పిల్లాడిని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది.

 ఈ విషయం తెలిసిన బందువులు,గ్రామస్థులు శిశువు జాడకోసం వెతుకుతున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కూడా పిల్లాడి కోసం ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున గాలిస్తున్నప్పటికి ఇప్పటివరకు శిశువు ఆచూకీ లభ్యం కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

 

loader