టీంఇండియా పేసర్ మహ్మద్ షమీపై కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు. షమీకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, అదేవిధంగా తనను మానసికంగానూ, శారీరకంగానూ వేధిస్తున్నాడంటూ అతని భార్య హసీన్ జహాన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

షమీతోపాటు మరో నలుగురు అతని కుటుంబసభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.హసీన్.. షమీ గురించి రోజుకో కొత్త విషయ బయటపెడుతున్నారు. ఇప్పటికే ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ .. కొత్తగా ప్రకటించిన  కాంట్రాక్ట్ జాబితాలో షమీ పేరును తొలగించింది.