టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ గురించి ఆయన భార్య హసీన్.. రోజుకో ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెడుతోంది. ఇప్పటికే షమీకి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని చెప్పిన హసీన్.. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏవిధంగా అయితే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మను పెళ్లి చేసుకున్నాడో.. షమీ కూడా అలానే ఓ హీరోయిన్ ని పెళ్లిచేసుకోవాలనుకున్నాడని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని షమీ తనతో చాలాసార్లు ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. అనవసరంగా తననను వివాహం చేసుకున్నానని.. వెంటనే విడాకులు ఇవ్వాలని షమీ బెదిరించినట్లు ఆమె వివరించారు.  ఒకానొక సందర్భంలో తనను చంపి.. అడవిలో పాతిపెట్టమని షమీ అతని సోదరిడికి చెప్పినట్లు హసీన్ తెలిపారు.

తనతో కలిసి షమీ కనీసం ఒక్క ఫంక్షన్ కి కూడా వచ్చేవాడు కాదని.. ఎవరికీ తనని భార్యగా పరిచయం చేసేవాడు కాదని ఆమె వాపోయారు. ఇప్పటికే హసీన్ ఇచ్చిన ఫిర్యాదుతో షమీపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.