గత రెండు మూడేండ్లుగా మోదీ స్వచ్ఛ భారత్ అంటూ దేశంలో ఉద్యమం తీసుకువచ్చారు. ఆర్ ఎస్ఎస్ నేతలపై కూడా ఆయన ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీకి ఒక అక్షరాయుధం దొరికింది. మోదీతో తలపడేందుకు ఆయన ఈ ఆయుధం ప్రయోగిస్తున్నారు. గత రెండు మూడేండ్లుగా మోదీ స్వచ్ఛ భారత్ అంటూ దేశంలో ఉద్యమం తీసుకువచ్చారు. దీనికి ధీటైన మాట కాంగ్రెస్ కు ఇంతవరకు దొరకలేదు. ఇపుడు దొరికింది. అదే సచ్ భారత్. వివరాల్లోకి వెళితే.. జేడీయూ నేత శరద్ యాదవ్ అధ్యక్షతన ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి స్వచ్ఛభారత్ కావాలని.. కానీ మనకు సచ్ భారత్ కావాలని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజీపీ విఫలమయ్యిందని ఆయన అన్నారు. విదేశాల్లో పేరుకు పోయిన నల్ల దనాన్ని వెనక్కి తెప్పించడంలోనూ, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలోనూ విఫలమయ్యారన్నారు.
మోదీ ఎక్కడికి వెళ్లినా.. అబద్దాలే చెబుతున్నారని.. కానీ మనకు నిజాలు కవాలని ఆయన ఆరోపించారు. అయితే.. మోడీ ఎక్కడ , ఏ సందర్భంలో అబద్దాలు చెప్పారో.. మాత్రం రాహుల్ చెప్పలేకపోయారు. ఆర్ ఎస్ఎస్ నేతలపై కూడా ఆయన ధ్వజమెత్తారు. ఆర్ ఎస్ ఎస్ నేతల కారణంగా దేశ రాజ్యాంగమే మారిపోతోందన్నారు.
‘ఒకరు ఈ దేశం మనది అనుకుంటుంటే.. మరొకరు నేను ఈ దేశానికి చెందిన వాడిని అని అనుకుంటున్నారు. అదే మనకు ఆర్ ఎస్ ఎస్ కి ఉన్న తేడా ’ అని రాహుల్ పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.
