నోట్ల కష్టాలు 2018 దాకా కొనసాగుతాయి. ఇంకా పెద్ద కష్టాలొస్తాయి దేశానికి. అయితే, ఇవేవీ ప్రధాని మోదీకి గండం కాదు.
వచ్చే సంవత్సరం అంటే 2017 లో దేశంలో ప్రజలకు నోట్ల పోటు మించిన కష్టాలుంటాయని అయితే ఇవేవి ప్రధాని నరేంద్రమోదీ పదవిని తాకలేవని ప్రఖ్యాత జ్యోతిష్యుడు శ్రీనివాస గార్గేయ అన్నారు.
విశాఖ ప్రెస్ క్లబ్ లో ముందున్న 2017 సంవత్సరం గురించి చెబుతూ ప్రజలకు సంబంధించి రాబోయేవి గడ్డురోజులే అన్నారు. ఇప్పటి నోట్ల సమస్య ఇంకా చాలా రోజులు కొనసాగుతుందని చెప్పారు.
కరెన్సీ కష్టాలకు మించిన కష్టాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంకావలని చెబుతూ వీటివల్ల నరేంద్ర మోదీ స్థానానికి ముప్పు లేదని చెప్పారు.
దేశంలో చాలా మంది పండిత్ లు మోదీకి 2017లో గండం ఉందని చెబుతూంటే గార్గేయ ఒక్కరే ప్రధానికి గండం ఉందనడాన్ని కొట్టి పడేశారు.
అయితే, ఆయన వివరణ గ్రహగతులకు సంబంధించింది కాకుండా, రాజకీయ విశ్లేషణ లాగా ఉంది.
‘పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎన్నికష్టాలు పడ్డా, ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయడం లేదు. దీనికి కారణం, దేశానికి ఏదో ప్రధానిగా ఏదో చేస్తారని మోదీ మీద ప్రజలకు నమ్మకం ఉండటమే కారణం,‘ అని ఆయన అన్నారు.
ఈ పరిస్థితి 2018 దాకా పీడిస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఇంతకంటే సీరియస్ సమస్యలు, కరువు కాటకాలు, ఉప ద్రవాలు ముఖ్యంగా విమాన ప్రమాదాలు, రైళ్లప్రమాదాలు, వంటివి తప్పవని కూడా ఆయన జోష్యం చెప్పారు.
