Asianet News TeluguAsianet News Telugu

నకిలీ నోట్ల డొంకంతా కదిపిన నాగార్జున ట్వీట్

హీరో నాగార్జున ట్వీట్ కు ప్రధాన మోదీ ఇచ్చిన సమాధానం  నోట్ల రద్దు లోని  నకలీ నోట్ల  గుట్టును రట్టు చేసింది

modi fakes the counterfeit Indian currency

నవంబర్ ఎనిమిదో తేదీన  అక్కినేని నాగార్జున పారిస్ నుంచి ఒక ట్వీట్ చేశారు.

 

ఇరవై పదాలు దాటని ఈ చిన్న ట్వీట్  చాలా దూరం వెళ్లింది.  కొందరేమో ఇది నోట్ల రద్దు ప్రసంగం తర్వాత రాతపూర్వకంగా ప్రధాని  తన లక్ష్యం వివరించిన ట్వీట్ గా కొందరు చెబుతారు.మరి కొందరు నకిలీ నోట్లను సాకుగా  తీసుకుంటున్నారని అంటారు.  ఇదే అవకాశంగా తీసుకుని మరికొందరు ప్రధాని సమాధానం మీద లోతయిన పరిశోధన చేశారు.  ఒకరేమో తెలుగునాట మేటి నటుడు కావడం,మరొక రు స్వయాన ప్రధాన మంత్రి కావడంతో ఈ  ట్వీట్లు  వేల వేలుగా రీట్వీట్ అయింది.

 

 

ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అపుడే ప్రకటించిన  అయిదొందల , వేయి నోట్ల రద్దు ను ఆహ్వానిస్తూ  అక్కినేని నాగార్జున ఈ  ట్వీట్ చేశారు. పన్ను కడుతున్న తన లాంటి వారికిదొక బహుమానం. ఇండియా అర్ధిక అగ్రరాజ్యమయ్యేదారి పట్టిందని ఆయన అన్నారు.

 

ప్రధాని ఈ ట్వీట్కు స్పందించారు. ఈ చర్య దేశంలో, దేశప్రగతిని కుంటుపరుస్తున్న అవినీతి, నల్ల ధనం, నకిలీనోట్లను నిర్మూలిస్తుందని  ప్రధాని సమాధానమిచ్చారు.

 

అంటే  ప్రధాని నోట్ల రద్దుకు మూడు లక్ష్యాలున్నాయి. అందులో నకిలీ నోట్ల సమస్య ఒకటి. అయితే, ఈ ట్వీట్ తర్వాత దేశం నకిలీ నోట్ల సమస్య అంత సీరియిస్ గా ఉందా అనే పరిశోధన మొదలయింది. చాలా మంది ఆర్థిక రంగ విజ్ఞులు ప్రభుత్వం దగ్గిర ఉన్న నకిలీ నోట్ల సమాచారాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు.

 

దేశంలో ఛలామణి లో ఉన్న నోట్లలో 86 శాతం ఉన్న అయిదొందల,వేయి నోట్లను  రద్దు చేయాలనుకున్నపుడు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుండకూడదు. సమస్య అంతకంటే పెద్దగా ఉండాలి.

 

ప్రభుత్వం దగ్గిర ఉన్న సమాచారం ప్రకారం నకిలీ నోట్ల బెడద అసలు సమస్యలే కాలేదని అర్థమవుతుంది. ప్రభుత్వం లోక్ సభకు సమర్పించిన సమాచారం  ప్రకారం  భారతీయ నకిలీ నోట్ల విలువ (Fake Indian Currency Notes FICN) విలువ రు. 400 కోట్లు దాటలేదు.

 

   ఈ విషయం అషామాషీగా చెబెతున్నది కాదు.  ఇండియన్ స్టాటిస్టిక్ ఇన్ స్టిట్యూట్, నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజన్సీ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ విషయాన్ని ఆగస్టు 5, 2016న  లోక్ సభలో పిసి మోహన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్ధిక శాఖ సహాయమంత్రి  అర్జున్ రామ్ మేఘ్వాల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

 

నాలుగేళ్లపాటు ఈ విలువ మారలేదు కూడా. ఇక రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారం 2015-16 దేశంలో ఛలామణిలో ఉన్న 90.26 బిలియన్  నోట్లలో  0.63 మిలియన్ లు అంటే 0.0007 శాతం మాత్రమే నకిలీ నోట్లు. ఈ  దొంగనోట్ల విలువంతా కలిపి  రు. 29.64 కోట్లు లేదట. ఇది చలామణిలో ఉన్న నోట్లలో కేవలం 0.0018 శాతమే.

 

2007-08 ప్రతి పదిలక్షలనోట్లలో నకిలీవి 4.4 నుంచి 8,1 నోటు మాత్రమే. 2007-08 నుంచి 2010-11 మధ్య దేశంలో ఛలామణి లో ఉన్న  56.74 బిలియన్ నోట్లలో  నకిలీ నోట్లు  కేవలం 3.9 లక్షలు మాత్రమే. అంటే ప్రతిమిలియన్ నోట్లలో నకిలీవి కేవలం 6.9 నోట్లు మాత్రమేనని రిజర్వుబ్యాంకు చెప్పింది.

 

ఇక కనిపెట్టిన దొంగనోట్ల గురించి చెప్పుకుంటే, 2015లో  43.8 కోట్ల రుపాయల విలువయిన  0.88 మిలియన్ నోట్లనుమాత్రమే పట్టుకోగలిగారని నేషనల్ క్రయిమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు చెబుతున్నారు. ఈ వివరాలను అర్జున్  రామ్ మేఘ్వాల్ లోక్ సభకు  నవంబర్ 18 న సమర్పించారు.

 

2015 లో ఇండియన్ స్టాటిస్టిటికల్ ఇన్ స్టిట్యూట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ సర్వే ఏమి చెబుతున్నది-

ఛలామణిలో ఉన్న ప్రతి పదిలక్షల నోట్లలో నకిలీవి కేవలం 250 నోట్లు మాత్రమే. ఈ అధ్యయనం ప్రకారం  ప్రతి ఏడాది రు.70 కోట్ల విలువయిన నకిలీ నోట్లు మాత్రమే దొంగనోట్లు. అంటే దేశంలో  86 శాతం నోట్లను రద్దు చేసేంత సమస్య నకిలీ నోట్లతో ఎపుడు ఎదురుకాలేదనే అర్థం.

 

అక్కి నేని నాగార్జునకు ఇచ్చి ట్వీట్ సమాధానం ప్రకారం దేశాన్ని కుదిపేస్తున్న  నోట్ల రద్దు తో  ప్రధాని మోడీ పట్టింది ఎలుకనే కదా?