Asianet News TeluguAsianet News Telugu

నోట్ల కష్టాలు 50 రోజుల్లో ఎందుకు తీరవంటే...

రిజర్వు బ్యాంకు నోట్ల ప్రింటింగ్ సామర్ధ్యం ప్రకారం జూన్ దాకా మోదీ తీసిన నోట్ల దెబ్బలు మానేలా లేవు

modi 50 day deadline fast approaching

నోట్ల కష్టాలు తీరేందుకు నరేంద్రమోడీ విధించిన  50 రోజుల గడువుకు ఇక నాలుగు రోజులే మిగిలి ఉంది. ఆయన ఛాతీ బాదుకుంటూ,  చేతులు చాపి చాపి , తిపి తిప్పి,ఆగి ఆగి నాటకీయంగా చేసిన ప్రసంగాల ప్రకారం కొత్త సంవత్సరం  అంటే జనవరి 1, 2017 తెల్లవారుతూనే, జనమంతా రోడ్లమీద కొచ్చిన చేతుల నిండా కొత్త నోట్ల గాల్లోకి విసరిస్తూ హ్యీపీ న్యూ ఇయర్ అని పాడుకోవాలి. అయితే, రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారం అంత సీను ఉన్నట్లు కనిపించడం లేదు.

 

అన్ని ఎటిఎంలు కడుపు నిండా నోట్లతో, అన్ని బ్యాంకు కౌంటర్ల నుంచి మీ డబ్బు  మీ కిష్టమయినంత తీసుకునే పరస్థితి జనవరి ఒక టో తేదీనే కాదు, ఆ తర్వాత మరొక అరునెలలకూడా వచ్చేలా లేదు. (ఈ నోట్లు ప్రధాని చేత కూడా కంట తడిపెట్టించాయి.వీడియో చూడండి)

 

ఎందుకో తెలుసా

 

1.    రిజర్వు బ్యాంకు అంచనాల  ప్రకారం రు. 9 లక్షల కోట్లు ($135బిలియన్) లేదా ప్రభుత్వం రద్దు చేసిన 86 శాతం కరెన్సీలో  35 శాతం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటే  మరొక అయిదు నెలలు కావాలట. అంటే 2017 మే నాటికి కూడా బ్యాంకుల్లో డబ్బులుండవు. ఎటిఎం అన్నీ పని చేయవు.

 

2.    అలా కాకుండా రు. 14 లక్షల కోట్లు ($210బిలియన్) అంటే మోదీ రద్దు చేసిన మొత్తం నోట్ల విలువ అందుబాటులోకి తీసుకురావాలంటే ఆగస్టు 2017 దాకా అగాల్సిందే. దీనికి కారణం, ఇపుడు కొత్తగా వచ్చిన రు.500 నోట్లను కావలసినన్ని ప్రింటు చేసే శక్తి భారత సెక్యూరిటీ ప్రెస్ లకు లేదట.

 

3.   రిజర్వు బ్యాంకు నాలుగు  సెక్యూరిటీ ప్రెస్ ల ( దేవాస్ ,మధ్య ప్రదేశ్;సాల్బొని ,ప.బెంగాల్ ; నాసిక్ ,మహారాష్ట్ర;  మైసూరు ,కర్నాటక) ముద్రణ సామర్థ్యం సంవత్సారానికి  2670 కోట్ల (26.7 బిలియన్లు) నోట్లు మాత్రమే.

 

4.   రిజర్వు బాంక్ ఆప్ ఇండియా వార్షిక నివేదిక 2016 (పేజీ 90) ఈ నాలుగు ప్రెస్ లు రోజుకు 7.4 కోట్లు నోట్లు(74 మిలియన్ )  మాత్రమే ప్రింట్ చేస్తాయి.

 

5.   ఈ ప్రెస్ లు రెండు షిప్టులు కాకుండా, రోజుకు మూడు షిప్ట్ లు పనిచేస్తే 11.1 కోట్ల నోట్ల మాత్రమే ప్రింట్ చేయగలవు.

 

6.    ఉన్న ప్రెస్ లలో రు. 500 లేదా రు. 2000నోట్లు  ప్రింటు చేసేందుకుమిషన్లు సగానికి తక్కువే ఉన్నాయి.

 

7.    ఉన్న మిషన్లన్నీ కేవలం ఒక్క రు. 500 నోట్లనే  24 గంటలూ ప్రింట్ చేస్తే, అపుడు కూడా మహా అంటే దినానికి 5.56 కోట్ల నోట్లనే అచ్చేయగలరు

  నవంబర్ 8న మోదీ ప్రకటన వెలువడటానికి ముందే  200 కోట్ల (2 బిలియన్) రు. 2000 నోట్లను అచ్చేయించే ఏర్పాట్లు చేసింది. దీని విలువంతా  4 లక్షల కోట్లే. ఇపుడు బజార్లో కనిపించే పింక్ నోట్లన్నీ ఇలా మొదటి విడత విడుదలయినవే.

 

ఇంకా ఎంతకాలం కావాలి

 

రిజర్వుబ్యాంక్ ను ఉటంకిస్తూ వచ్చిన మీడియా కథనాల ప్రకారం నవంబర్ 30, 2016 అచ్చయిన రు.500 నోట్లు 10 కోట్లు మాత్రమే.

అందువల్ల  రద్దు చేసిన విలువతోసమానమయిన నోట్లన్నీ పునర్ముద్రించడానికి  122 నుంచి  212 రోజుల సమయం పడుతుంది. మార్చికి కాకపోయినా జూలై నాటికి గానికి అందరి నోట్లు అందుబాటులోకి రావు.

 

కాబట్టి 50 రోజులలో (నవంబర్ 30 ,2016 నుంచి రు. 500 నోట్ల ప్రింటింగ్ మొదలయిందునుకుంటే) పరిస్థితి చక్కబడుతుందని ప్రధాని మోదీ చేసిన ప్రకటన బూకాయింపు మాత్రమే.