మొబైల్ ఫోన్ సిమ్ తీసుకునేటప్పుడు చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన నెట్ వర్క్ ఎంచుకోవడం తోపాటు.. ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఎలాపడితే అలా ఫోన్ నెంబర్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివాళ్లకి ఇప్పుడు టెలికాం అధికారులు షాక్ ఇచ్చారు. దేశంలో ఉన్న అందరి ఫోన్ నెంబర్లు త్వరలో మారిపోనున్నాయి. మీరు చదివింది నిజమే. ఇప్పటివరకు ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ.. త్వరలో అవి 13నెంబర్లు కానున్నాయి.

ఫోన్ నెంబర్ల విషయంలో భద్రత పెంచేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1వ తేదీ నుంచి కొత్తగా రానున్న సిమ్ లన్నింటికీ 13 నెంబర్లు ఉండనున్నాయి. ఆల్రడీ ఇప్పుడు వినియోగంలో ఉన్న 10 అంకెల ఫోన్ నెంబర్లకు అక్టోబర్ నుంచి మరో మూడు నెంబర్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. పది నెంబర్ల ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవడమే చాలా మందికి కష్టం అలాంటిది.. ఇప్పుడు అదనంగా మరో మూడు అంకెలు చేరనున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ లు కూడా ధ్రువీకరించాయి.