మిథాలీరాజ్ పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు డ్రస్ బాలేదంటూ విమర్శలు ఫోటో డీలీట్ చేయమని ఓ అభిమాని విన్నపం

మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. టీం ఇండియా కెప్టెన్ వి అయ్యి ఉండి ఇలాంటి డ్రస్లులా వేసుకునేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. మిథాలిరాజ్.. తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందులో మిథాలి స్లీవ్స్ వేసుకున్న డ్రస్సుతో కనిపించింది. మిగిలిన వారంతా నిండుగా ఉండే డ్రస్సులు వేసుకున్నారు. అది అభిమానులకు నచ్చలేదు. దీంతో.. తీవ్ర విమర్శల దాడికి దిగారు.

‘డిలీట్‌ చేయండి మేడమ్‌. మిమ్మల్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటారు.కానీ మీరు వేసుకున్న దుస్తులు బాలేవు’.. ‘మీ నుంచి ఇలాంటివి వూహించలేదు. మీపై మీకు ఎలాగో గౌరవం లేదు. కనీసం అభిమానులకు మీపై ఉన్న గౌరవాన్నైనా నిలబెట్టుకోండి’.. ‘నువ్వు మహిళల టీం ఇండియా కెప్టెన్‌వి. సినిమా సెలబ్రిటీవి కావు. ఈ ఫొటో డిలీట్‌ చేసెయ్‌’.. ‘మిమ్మల్ని ఇలాంటి దుస్తుల్లో చూడలేకపోతున్నాం. భారతీయ యువతిగా అందులోనూ తమిళనాడు యువతిగా ఉండండి’ అంటూ మిథాలీపై ట్వీట్లు గుప్పించారు

నిజానికి మిథాలి వేసుకున్న డ్రస్ అందరి డ్రస్సులా లేదు కానీ.. అలా అని అభ్యంతర కరంగా కూడా లేదు. అలాంటి డ్రస్సులు చాలా మంది సెలబ్రెటీలు, స్పోర్ట్స్ స్టార్స్ వేసుకుంటూనే ఉన్నారు. వారందరూ వేసుకున్నప్పుడు రాని అభ్యంతరం.. మిథాలి వేసుకున్నప్పుడు మాత్రం వచ్చింది. ఎందుకో వారికే తెలియాలి అని అంటున్నారు మరి కొందరు.