మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా ఒలోడార్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సందడి చేశారు. తెలుగు ప్రిన్సెస్‌ ట్రెడిషనల్‌ కల్చరల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు  ఆమె కాకినాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె  సాంబమూర్తినగర్‌లోని ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాలను సందర్శించారు. వారితో కలిసి సందడి చేశారు. 

బధిర విద్యార్థులతో కేవలం సైగలతోనే ఆమె మాట్లాడటం విశేషం. ఆమెతో పాటు ఫ్యాషన్‌ డిజైనర్‌, గ్లోబర్‌ ఎడ్వైజర్‌ సతీష్‌ టిక్కర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఈవెంట్‌ మేనేజర్‌ శిరీష మాట్లాడుతూ యువతలో అందంతో పాటు సామాజిక సేవా స్పృహను పెంపొందించే లక్ష్యంగా కాకినాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే బధిరుల పాఠశాలను సందర్శించామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు.