మిస్ కర్ణాటకగా.. తెలుగమ్మాయి

మిస్ కర్ణాటకగా.. తెలుగమ్మాయి

తెలుగమ్మాయి.. పరాయి రాష్ట్రంలో తన సత్తా చాటింది. మిస్ కర్ణాటక కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఆమె భావన(21). తిరుపతి నగరానికి చెందిన దుర్గం ప్రభాకర్ రెడ్డి, కృష్ణవేణిల కుమార్తే.. ఈ భావన. పుట్టి పెరిగింది అంతా.. తిరుపతిలో అయినప్పటికీ.. కొంతకాలం క్రితం భావన కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారు.

ప్రస్తుతం బెంగుళూరు బసవనగూడిలోని బీయంఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న భావనా అనుకోకుండా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని 2018సంవత్సరానికి గాను మిస్‌ ఇండియా కర్ణాటక టైటిల్‌ను దక్కించుకు న్నారు. తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగే ఆమెకు కన్నడ మాత్రం కొద్దిగానే తెలుసు.గత ఫిబ్రవరిలో ఈ పోటీలు జరిగాయి. కర్ణాటక రాష్ట్ర స్థాయిలో 500మంది యువతులతో పోటీపడి రాష్ట్రస్థాయిలో ఎంపికైంది. అనంతరం సౌత్‌జోన్‌ స్థాయిలో ఐదు రాష్ట్రాలకు చెందిన యువతులతో పోటీపడి కర్ణాటక తరపున మిస్‌ కర్ణాటకగా ఎంపికైంది. మిస్‌ ఇండియా పోటీల్లో భాగంగా అంతర్జాలంలో నిర్వహిస్తున్న పోల్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది. ఐటీసీ ఆశీర్వాద్‌, కింగ్‌ ఫిషర్‌ బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌, హిమాలయ డ్రగ్స్‌ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos