బాలీవుడ్ నటి ప్రేమలో వెస్టిండీస్ క్రికెటర్

First Published 12, Apr 2018, 3:27 PM IST
Miss India and Bollywood actress Natasha Suri is dating cricketer Dwayne Bravo
Highlights
బ్రావో ప్రేమలో మిస్ ఇండియా

బాలీవుడ్ హీరోయిన్లను క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ లు అలా బాలీవుడ్ నటీమణులను పెళ్లిచేసుకున్నవారే. ఇప్పుడు వీరి జాబితాలోకి మరో క్రికెటర్ చేరాడు. కాకపోతే ఆ క్రికెటర్ ది మన దేశం కాదు. వెస్టిండీస్.
చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ జ‌ట్టు మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో.. బాలీవుడ్ న‌టి, మిస్ ఇండియా న‌టాషా సూరితో ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో న‌వ్వుతూ మాట్లాడుకుంటుండ‌డం మీడియా కంట‌ప‌డింది. అలాగే బ్రావోతో దిగిన ఫోటోల‌ను న‌టాషా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది.
 
బ్రావోకు, న‌టాషాకు దాదాపు ప‌దేళ్ల నుంచి ప‌రిచ‌యం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ ప‌రిచ‌యంతోనే ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం ముంబై వెళ్లిన బ్రావో న‌టాషాతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడ‌ట‌. బ్రావో ఇటీవ‌ల త‌న భార్య‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌టాషాతో బ్రావో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడని బాలీవుడ్ మీడియా వార్త‌లు రాస్తోంది. అయితే న‌ట‌షా స‌న్నిహితులు మాత్రం వారిది స్నేహం మాత్ర‌మేన‌ని, ప్రేమ కాద‌ని చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

loader