మిషన్ భగీరథ పనుల్లో అపశృతి

First Published 23, Dec 2017, 7:16 PM IST
mishaps in mission bhagiratha works
Highlights
  • మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం
  • ఆరుగురికి తీవ్ర గాయాలు
  • క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.  కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో  గ్రామంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర హెడ్ వాటర్ ట్యాంక్ పైకప్పు కూలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

 మొత్తం గాయపడిన ఆరుగురిలో ఒకరు మినహా మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు.   

ఈ సంఘనసపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

loader