హాంకాంగ్‌లో డీటీసీ టీ20 బ్లిట్జ్‌ టోర్నీలో మిస్బా ఈ ఘనత సాధించాడు.

6 బై 6 క్లబ్ లో పాకిస్థాన్‌ ఆటగాడు మిస్బా ఉల్‌ హక్‌ కూడా చేరిపోయాడు. అంతర్జాతీయ మ్యాచ్ కాకపోయినా పాకిస్థాన్ క్రికెటర్ మిస్బా హుల్ హక్ ఆరుకు ఆరు సిక్సులు బాది కొత్త రికార్డు చేశాడు.

హాంకాంగ్‌లో డీటీసీ టీ20 బ్లిట్జ్‌ టోర్నీలో మిస్బా ఈ ఘనత సాధించాడు.

గురువారం హాంగ్‌ హమ్‌ జేడీ జాగ్వార్స్‌-హెచ్‌కేఐ యునైటెడ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో హెచ్‌కేఐ యునైటెడ్‌ ఆటగాడైన మిస్బా వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు.

జాగ్వార్స్‌ ఆటగాడు ఇమ్రాన్‌ వేసిన ఓవర్లో లాస్ట్ రెండు బాల్స్ ను సిక్స్ కొట్టిన మిస్బా ఆ తర్వాత క్యాడీ వేసిన ఓవర్లో వరసుగా నాలుగు బాల్స్ ను బౌండరీ బయటకు పంపాడు.

గతంలో టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ ఈ ఘనత సాధించిన విషయం తెలిసేందే.