ఇంటి అద్దె కట్టలేదని ఏం చేశాడో తెలుసా. ?

First Published 12, May 2018, 11:51 AM IST
minor girl marraige busted
Highlights

ఇంటి అద్దె కట్టలేదని ఏం చేశాడో తెలుసా. ?

ఇంటి అద్దె కట్టలేదని ఓ మైనర్ బాలిక జీవితానికి ఎసరు  తెచ్చాడో వ్యక్తి. తనని పెళ్ళిచేసుకుంటే ఇంటి అద్దె కట్టే బాధ తప్పుతుంది..పైగా ఆర్ధిక సహాయం చేస్తానని బాలిక తల్లిని నమ్మించి పెళ్ళికి విఫలయత్నం చేశాడు రమేష్ అనే వ్యక్తి. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుళ్లపల్లి మండలం కాటేదాన్ గ్రామంలో జరిగింది.  రమేష్ అనే వికలాంగుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది ఓ కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలున్న ఆ కుటుంబం పేదరికంతో మగ్గిపోతుంది. పైగా కొన్ని నెలల నుంచి ఇంటి అద్దె కట్టే స్థోమత కూడా లేదు..

దీంతో ఇంటి ఓనర్ రమేష్ 16 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకుంటాను జీవితాంతం ఇంటి అద్దె కట్టే బాధ తప్పుతుంది దాంతో పాటు కొంత ఆర్ధిక సహాయం చేస్తానని బాలిక తల్లిని ఒప్పించాడు. ఈ పెళ్లి ఇష్టం లేని బాలిక తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ  వ్యవహారం కాస్త  చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులకు తెలిసింది.. వెంటనే వారు పోలీసులతో రమేష్ ఇంటికి చేసురుకుని  అతన్ని ఆరెస్ట్ చేయించారు. అనంతరం బాలికను స్టేట్ హోమ్ కు తరలించారు. 

loader