బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లపై మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి హోదా, ప్యాకేజీ విషయంలో.. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సోము వీర్రాజు మీడియా ముందు ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంత్రి శనివారం  సోమువీర్రాజుపై విరుచుకుపడ్డారు.

వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి ఏజెంట్‌గా సోము వీర్రాజు యాక్టివ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అన్నారు.  రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.