మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృవియోగం

minister Kalva Srinivasulus mother passes away
Highlights

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తల్లి పుల్లమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. అనారోగ్యంతో ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తల్లి పుల్లమ్మ కన్నుమూశారు.

ఆమె వయసు 80 సంవత్సరాలు. అనారోగ్యంతో ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కాల్వ హుటాహుటిన అమరావతి నుంచి స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు.పుల్లమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు  మంత్రి కాలువ శ్రీనివాస్ ను ఫోన్ లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి  సీఎం అడిగి తెలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, వరదాపురం సూరి, ప్రభాకర్‌ చౌదరి, బీకే పార్థసారథి, మేయర్ స్వరూప తదితరులు సంతాపం ప్రకటించారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పుల్లమ్మ అంత్యక్రియలు నేడు  బికె సముద్రం మం.లోని అగ్రహారం లో  నిర్వహించేందుకు  కుటుంబ సభ్యులు ఏర్పాట్లు  చేస్తున్నారు.

loader