జగన్ కి దేవినేని ఉమా 7 ప్రశ్నలు

జగన్ కి దేవినేని ఉమా  7 ప్రశ్నలు

ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ కి 7 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించిన దేవినేని.. పలు విషయాల గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తివివరాలను ప్రాజెక్ట్ పురోగతిని దేవినేని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.

Q:1:అమరావతిని భ్రమరావతి అని ఎలా పిలుస్తారు? రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

Q:2: కడపజిల్లా లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని సహించలేక పోతున్నావు. సమాధానం చెప్పాలి.  

Q:3: విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ మరియు కనక దుర్గ ఫ్లైఓవర్ పై విషం కక్కుతున్నారు.

Q:4: తిరుపతిలో బైక్ తగులబెట్టి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు.

Q:5: జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కుట్రలు కుతంత్రాలు అవసరమా అని ప్రశ్నించారు?

Q:6: కృష్ణా జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను  మీరు అధికారంలోకి వస్తామని చెప్పి డబ్బులు వసూళ్లు చేశారు ఇది నీ కనుసన్నల లోనే జరుగుతుందా లేదా?

Q:7: ఫేక్ మెసేజ్ లతో రాష్ట్ర ప్రజలను ఫేక్ వీడియో క్లిప్పింగ్స్ తో శాంతియుతంగా చేయవలసిన పాదయాత్ర మార్నింగ్ వాక్ ఈవెనింగ్ వాక్ లాగానే ఉంది? నీవు పాదయాత్ర చేస్తున్న రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేయించారు నీకు తెలుసా? అని ప్రశ్నించారు.

 

వెంటనే ఈ ఏడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos