లోకేశ్ కలుసుకోవడం అంత ‘వీజీ’ కాదు, క్యాబినెట్ మంత్రయితే మరీ కష్టం గంటలతరబడి వెయిట్ చేయాల్సిందే
మొత్తం క్యాబినెట్ లో అందరి కంటే పెద్ద గొంతు ఉండేది కార్మిక మంత్రి అచ్చన్నాయుడికే. దాన్నొక ఆయుధంగా తెలుగుదేశం పార్టీ వాడుకుంటూ ఉంది. గొంతువల్లే అచ్చన్నాయుడికి పార్టీ లో మంచి పేరొచ్చింది. జనంలో గుర్తింపొచ్చింది. అసెంబ్లీలో నెంబర్ ఉపన్యాసకుడయ్యాడు. ఎపుడయిన గొడవజరిగిన ఏమీ వినబడని పరిస్థితి వచ్చినా, వినిపించే గొంతొక్కటే, అచ్చన్నాయుడి. కణేల్ మనే అచ్చన్నాయుడి మాటలో క్లారీటీ కూడా ఉంటుంది. ఆయన దాడి ముఖం మ్మీద ముష్టిఘాతం లాగా ఉంటుంది. ఈ గొంతే ఆయన్ను రాజకీయాలలో నిలబెడుతూ ఉంది. ఈ గొంతుండబట్టే ఆయన జగన్ ని విమర్శించడంలో ఎపుడూ ముందుంటారు. ఇలాంటి అచ్చన్నాయుడికి కూడా పార్టీలో అవమానం తప్పలేదు. అదీకూడా తన కంటే చాలా జూనియర్ అయినా ఐటి మంత్రి లోకేశ్ దగ్గిర.
అచ్చన్నాయుడికి కూడా లోకేశ్ దగ్గిర వెయిటింగ్ తప్పలేదు. తన పెద్ద వాళ్లను వెయిట్ చేయించడం లోకేశ్ కు సరదా అనిచెబుతారు. ఒకసారి ప్రతిభా భారతిని వెయిట్ చేయించిన విషయం సంచలనం సృష్టించింది. అప్పటికింకా ఆయన మంత్రే కాలేదు. ఈ మధ్య కొత్త మంత్రి జవహర్ ను కూడా వెయిట్ చేయించి , మంత్రి అయినా తన దగ్గిర వాళ్ల హోదా ఏమిటో గుర్తు చేశారు. ఇపుడు ఇలాంటి అనుభవం అచ్చన్నకు ఎదురయింది. అదే ఆశ్చర్యం. సాధారణంగా మంత్రులు ఒకరి ఛేంబర్ లోకి మరొకరు తోసుకుంటూ వెళుతుంటారు. అవతలి మంత్రి కూడా ప్రయారిటీతో విజిటర్ మంత్రితో ముందు మాట్లాడటం అనేది సంప్రదాయం. అయితే, ఈ మధ్య అచ్చన్నాయుడు లోకేశ్ గదిలోకివెళ్లేందుకు గంటలు పట్టిందట. అంతసేపు ఆయనకు లోనుంచి పిలుపు రాలేదట. ఇది తెలుగుదేశం సర్కిల్స్ లో తెగ చర్చనీయాంశమయింది. ఇది పూర్వం ప్రతిభా భారతికి, మంత్రి అయ్యాక జవహర్ కు,అచ్చన్నకు మాత్రమే జరుగుతున్నది కాదు, చాలా మంతి మంత్రులు లోకేశ్ గదిలోకి వెళ్లేందుకు వెయిట్ చేశారట.కాకపోతే, అన్ని కథలు బయటకు పొక్కడం లేదని టిడిపి వర్గాలే చెబుతున్నాయి.
ఈ కారణం చేతనే కొంత మంది పనులున్నా సారే, వాటిని మానుకుంటున్నారే తప్ప లోకేశ్ ను కలుసుకునేందుకు వెళ్లడం లేదట.
