మేడ్చల్ జిల్లా కీసర మండలం లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దహనమైపోయింది. తిమ్మాయిపల్లి నుండి కీసరకు 18 మంది ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులతో బయలుదేరిన సుప్రీమ్ ట్రావెల్స్ కి చెందిన బస్సులో షాట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  దీన్ని గమనించిన ఉద్యోగులు అప్రమత్తమై బస్సులోంచి దిగిపోయారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

 ఈ అగ్నిప్రమాదం పెట్రోల్ బంకు పక్కనే జరగడంతో ప్రమాద స్థలంలో తీవ్ర ఉత్కంట చోటుచేసుకుంది. అయితే సమయానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.   

 

అగ్ని ప్రమాద వీడియో