ప‌దేళ్ల‌ బాలుడు 12 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌ను క‌నుగొన్నాడు.

millions year fossil found in mexico
Highlights

  • అమెరికా లో 12 లక్షల సంవత్సరాల శిలాజం.
  • పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు.

 

అమెరికాలోని న్యూ మెక్సికో లో ప‌దేళ్ల అబ్బాయి త‌న కుటుంబ స‌భ్యుల‌తో లాస్ క్రూసెస్ అడ‌వి ప్రాంతానికి షికారుకి వెళ్లారు. అయితే ఆడుకుంటు ఉండ‌గా ఆ అబ్బాయికి  12 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం శిలాజాన్ని క‌నుగొన్నాడు. ఆ అబ్బాయి పేరు జూడె స్పార్క్‌, బుధ‌వారం సాయంత్రం ఈ శిలాజాన్ని అనుకోకుండా క‌నుగొన్నాడు.

 
ఈ శిలాజాన్ని ప‌రీక్షించిన పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు ఇది 12 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం జీవించిన జంతువుద‌ని నిర్థారించారు. ఇది చాలా పెద్ద జంతువు పుర్రే అని వారు అనుమానిస్తున్నారు. దొరికిన శిలాజం పుర్రేలోని స‌గ‌భాగం కావ‌డంతో కొంత సందిగ్థ‌త ఉంద‌ని వారు తెలిపారు. అయితే ఈ పుర్రే ఏనుగుదై ఉండొచ్చ‌న్నారు. ఈ శిలాజం ఇప్ప‌టి వ‌ర‌కు దొరికిన‌ వాటి క‌న్న చాలా భిన్నంగా ఉంద‌ని పుర‌తత్వశాస్త్ర‌వేత్త‌లు పెర్కోన్నారు. అంతేకాదు అందులో కొంత‌భాగం చాలా ప‌ల్చ‌గా ఉంద‌ని తెలిపారు.

ఈ శిలాజాన్ని మ‌రిన్ని కోణాల‌లో పరీక్షించిన త‌రువాత త‌దుప‌రి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీనితో ఆ నాటి వాతావ‌ర‌ణ స్థితిగ‌తుల‌ను ప‌రిశోధించ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు పెర్కోన్నారు.

loader