చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి ఫోన్లకు భారత మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమి నుంచి ఏ ఫోన్ విడుదలైనా.. సెకన్లలో హాట్ కేకుల్లా అమ్ముడౌతాయి. కాగా.. ఇప్పుడు షియోమికి గట్టి పోటీ ఇచ్చేందుకు మైక్రోమ్యాక్స్ రంగం సిద్ధం చేసుకుంది.

 రెడ్ మీ5కి పోటీగా మైక్రోమ్యాక్స్ ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.  భారత్ 5 ప్రో పేరిట విడుదల చేసిన ఈ ఫోన్  ధర రూ.7,999గా ప్రకటించింది. రెడ్ మీ5 మార్కెట్లోకి మార్చి 14న అడుగుపెట్టగా.. అదే రోజు మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రోని విడుదలచేసింది. ధర, లుక్ తోపాటు ఫీచర్లలోనూ భారత్ 5 ప్రో.. రెడ్ మీ 5కి గట్టి పోటీ ఇస్తోంది.

 

మైక్రో మ్యాక్స్ భారత్ 5 ప్రొ ఫీచర్లు...

5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
మైక్రోఎస్డీ కార్డు సదుపాయం

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌