ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్.. మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమైంది. భారత్ గో పేరిట ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనున్నట్లు ఈ దేశీయ కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ని అత్యంత తక్కువ ధరకే అందించనున్నట్లు తెలిపింది. రూ.2వేల లోపే ఫోన్ ధర ఉంటుందని చెప్పింది. ఈ నెలాఖరుకి ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సందడి చేయనుంది.

ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఓఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 512 ఎంబీ లేదా 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 4 ఇంచ్ డిస్‌ప్లే, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 1600 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో గూగుల్ గో, మ్యాప్స్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, ఫైల్స్ గో తదితర లైట్ వెయిట్ యాప్స్‌ ను ఇన్‌బిల్ట్‌ గా అందివ్వనున్నారు. కాగా మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.