ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్ సమీపంలో  భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదం లో  పైలట్, కోపైలట్ తో పాటు మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. హైలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా తక్కువ ఎత్తు నుండి కూలింది కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అందువల్లే ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్వల్ప గాయాలతో బైటపడినట్లు తెలిపారు.

 

కేదార్‌నాథ్‌లో నిర్మాణ పనులు చేపట్టేందుకు గుప్త కాశి నుంచి యంత్ర పరికరాలను తీసుకొస్తున్న ఎమ్ఐ-17 కార్గో హెలికాప్టర్ హెలిప్యాడ్‌పై దిగుతుండగా ఓ ఇనుప కడ్డీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.