చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి..మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి సన్నద్ధమౌతోంది. ఇప్పటికే అతి తక్కువ ధరకే రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లను తాజాగా షియోమి భారత మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని ఆన్ లైన్ లో విడుదల చేయగా.. కేవలం మూడు నిమిషాల్లో 3లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. కాగా.. ఇప్పుడు మరో ఫోన్ ని తీసుకువస్తోంది.

షియోమి ఎంఐ మిక్స్ 2ఎస్ పేరిట విడుదల చేస్తున్న ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ను స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో తీసుకురానున్నారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఎంఐ మిక్స్2కు కొనసాగింపుగా దీనిని తీసుకువస్తున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్  ఫీచర్లతో దీనిని తయారు చేస్తున్నట్లు సమాచారం. 5.99 ఇంచెస్ డిస్ ఫ్లే, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ, 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా, 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 40 వేలు ఉంటుందని సమాచారం. ఫేస్‌ రికగ్నిషన్‌ సౌకర్యం ఉంటుందట. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఈ ఆప్షన్‌ పని చేస్తుంది.