యానివర్సరీ స్పెషల్.. మేజు నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్

First Published 3, Dec 2017, 10:35 AM IST
Meizu to launch Meizu 15 and 15 Plus in the market soon
Highlights
  • మేజు ఎం6ఎస్, మేజు ఎం6 నోట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించిన మేజు.. వాటితోపాటు మేజు ప్రో7, ప్రో 7ప్లస్ ఫోన్లను కూడా విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. అయితే.. ఇవి కాక మరో రెండు స్మార్ట్ ఫోన్లను కూడా మేజు విడుదలచేస్తోంది.

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మేజు మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. మేజు ఎం6ఎస్, మేజు ఎం6 నోట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించిన మేజు.. వాటితోపాటు మేజు ప్రో7, ప్రో 7ప్లస్ ఫోన్లను కూడా విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. అయితే.. ఇవి కాక మరో రెండు స్మార్ట్ ఫోన్లను కూడా మేజు విడుదలచేస్తోంది.

మేజు కంపెనీ ప్రారంభించి 15 సంత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా రెండు స్పెషల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తోంది. మేజు 15, మేజు 15 ప్లస్ పేరిట వచ్చే ఏడాది ఈ స్పెషల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేజు 15 ప్లస్ ఫోన్ కి సంబంధించిన ఫోటోని మాత్రం ఇటీవల కంపెనీ ఫౌండర్ , సీఈవో జాక్ వాంగ్ విడుదల చేశారు. కానీ.. ఆ ఫోన్లలోని స్పెషల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే వాటిని కూడా తెలియజేస్తామని వారు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

loader