రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే దళిత అభ్యర్థిని తీసుకురావడంతో అగ్రహించిన  ప్రతిపక్షం ప్రతి వ్యూహం రచిస్తున్నది.  బిజెపి నిర్ణయం ఏకపక్షం అని ప్రతిపక్షపార్టీలు విమర్శిస్తున్నాయి. అందువల్ల బీహార్ గవర్నర్ , మాజీ భారతీయ దళిత మోర్చ నేత రామ్ నాథ్ కోవింద్ కు పోటీగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ పేరు ను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది.

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే దళిత అభ్యర్థిని తీసుకురావడంతో అగ్రహించిన ప్రతిపక్షం ప్రతి వ్యూహం రచిస్తున్నది. బిజెపి నిర్ణయం ఏకపక్షం అని ప్రతిపక్షపార్టీలు విమర్శిస్తున్నాయి. అందువల్ల బీహార్ గవర్నర్ , మాజీ భారతీయ దళిత మోర్చ నేత రామ్ నాథ్ కోవింద్ ను మద్దతు ప్రటకించే అవకాశం తక్కువగా ఉంది.

దీనికి దళిత వ్యూహం ద్వారానే సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను బరిలో నిలిపే అవకాశాలను ఈ పార్టీలు పరిశీలిస్తున్నాయి. మీరా కుమార్ స్వర్గీయ జగజ్జీవన రామ్ కుమార్తె.

మీరాకుమార్ తో పాటు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుశీల్‌కుమార్‌ షిండే, బీఆర్ అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ యశ్వంత్ ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

 రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు గురువారం సమావేశమయ్యే అవకాశం ఉంది.ఈ విషయాన్ని శరద్ యాదవ్ వెల్లడించారు.
‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనే భావిస్తున్నాం. ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థి ఉండవచ్చు. బిజెపి ఒక దళిత నేత పేరును ప్రకటించినందున ప్రతిపక్ష పార్టీలు కూడా అదే కోవలోమరొక దళిత నాయకుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి’ మరొక నేత వెల్లడించారు.