Asianet News TeluguAsianet News Telugu

మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

మక్కా మసీద్ బాంబు పేలుళ్ళ కేసును నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. 11 ఏళ్ళ సదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఇవాళ సంచలనమైన తుది తీర్పు  వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును కేవలం రెండు నిమిషాల్లోనే ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. ఈ పేలుళ్ల కేసులో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యింది. దీంతో తీర్పు వారికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఈ తీర్పు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. 

2007 మే 18న మక్కా మసీద్ లో  ప్రార్ధనల సమయంలో పేలిన టిఫిన్ బాంబు పేలుళ్ల దాటికి 9  మంది  చనిపోగా , తర్వాత జరిగిన అల్లర్లను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 5  గురు మృతి చెందారు. ఇలా ఈ ఘటనలో మొత్తం 14  మంది మృతి చెందారు. అయితే ఈ బాంబు పేలుళ్ల కు పాల్పడిఉంటారని 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై చార్జీషీట్ నమోదుచేశారు. వీరిలో దేవేందర్‌గుప్తా(ఏ1), లోకేష్‌శర్మ(ఏ2), సందీప్‌డాంగే (ఏ3), రామచంద్ర కళాసంగ్రా (ఏ4), సునిల్‌ జోషి (ఏ5), స్వామి అసిమానంద(ఏ6), భరత్ భాయి (ఏ7), రాజేందర్‌ చౌదరి(ఏ8), తేజ్‌రామ్‌ పరమార్‌(ఏ9), అమిత్ చౌహాన్‌ (ఏ10) లు ఉన్నారు. వీరిలో ఐదుగురిని (స్వామి అసిమానంద, భరత్ భాయి, దేవేందర్‌గుప్తా,రాజేందర్‌ చౌదరి, లోకేష్‌శర్మ) ని నిర్దోషులుగా ప్రకటించగా, మరో ఐదుగురిపై చార్జిషీట్ కొనసాగనున్నట్లు సమాచారం. 

హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నందుకే ముస్లిం లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బాంబు బ్లాస్ట్ లు చేసారని కోర్టుకి వెల్లడించిన ఎన్ఐఏ ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలను అందించలేక పోయింది. దీంతో 11 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసును కోర్టే కొట్టివేసింది.ఇవాళ ఈ సున్నితమైన కేసులో తీర్పు వెలువడనున్న నేపధ్యం లో హైదరాబాద్ లో ముందే పోలీసులు అలెర్ట్ అయ్యారు. తీర్పు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తూ పాతబస్తీ లో ప్రత్యేక బలగాల మోహరించిన పోలీసులు నాంపల్లి కోర్ట్ దగ్గర కూడా భారీ భద్రత కల్పించారు.
 
mecca masjid blast case struck down all accused acquitted by NIA court

Follow Us:
Download App:
  • android
  • ios