బెంగాలి దినపత్రికలో వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది

దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా పెళ్లి విషయంలో మాత్రం కులం, మతం కట్టుబాట్ల మధ్యనే వివాహాలు జరుగుతున్నాయి.

అయితే కోల్ కతాకు చెందిన ఓ కుటుంబం మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి తమకు కమ్యూనిస్టు వరుడు మాత్రమే కావాలని పట్టుబట్టింది. అంతేకాదు అలాంటి వారి కోసం మేట్రిమోనిలో ప్రకటన కూడా ఇచ్చింది.

ఆ ప్రకటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

కోల్ కతాకు చెందిన దిపంజ్ దాస్ గుప్తా ది కమ్యూనిస్టు కుటుంబం. ఆమె చెల్లెలు సంసృతంలో పిజీ కూడా చేసింది. ఆమె కోసం వరుడుని వెతికే పనులో దాస్ గుప్తా సీపీఐ అనుకూల పత్రిక అయిన గణశక్తిలో ఓ ప్రకటన ఇచ్చాడు.

తన చెల్లలకు కమ్యూనిస్టు లేదా ఆ భావజలంగల వ్యక్తి మాత్రమే వరుడుగా కావాలి అని ఆ ప్రకటన సారాంశం.

ఇలాంటి ప్రకటనపై మీడియా దాస్ గుప్తాను ప్రశ్నిస్తే ఆయన మాత్రం కమ్యూనిస్టులు మాత్రమే విశాల దృక్పథంతో ఉంటారని అందుకే తన చెల్లెలకు అలాంటి వరుడు కావాలని ప్రకటన ఇచ్చినట్లు వివరణ ఇచ్చాడు.