Asianet News TeluguAsianet News Telugu

పొల్యూషన్ ఎఫెక్ట్: నిలిచిపోయిన మారుతి ‘జిప్సీ’ప్రయాణం

కర్బన ఉద్గారాల నియంత్రణపై ఆటోమొబైల్ మేజర్లు ద్రుష్టి సారిస్తున్నాయి. వచ్చే ఏప్రిల్ నుంచి కర్బన రహిత, పర్యావరణ హిత వాహనాల వినియోగానికే పెద్ద పీట వేస్తుండటంతో తమకు పేరు తెచ్చి పెట్టిన మోడల్ వ్యాన్లు, కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. అందులో మారుతి సుజుకి ఉత్పత్తి జిప్సీ వ్యాన్ ఒకటి. 33 దశాబ్దాలుగా పలు రకాల మోడళ్లతో కారు, వ్యాన్ల ప్రియులను ఆకర్షించిన ‘జిప్సీ’ వ్యాన్ ఉత్పత్తిని నిలిపేసింది. డీలర్లను కూడా బుకింగ్స్ నమోదు చేయవద్దని అధికారికంగా తేల్చి చెప్పింది. 

Maruti Suzuki Gypsy discontinues after 33 years
Author
Mumbai, First Published Mar 6, 2019, 1:12 PM IST

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ మేజర్ మారుతి సుజుకి వినూత్న మోడల్ కార్లు, వ్యాన్ల ఉత్పత్తికి పెట్టింది పేరు. అలాగే మారుతి సుజుకి నుంచి మూడు దశాబ్దాల క్రితమే విపణిలో అడుగు పెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) వ్యాన్ జిప్సీ.. గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 

మూడు దశాబ్దాలుగా భారత మార్కెట్లో మంచి డిమాండ్‌ను దక్కించుకుని, సుదీర్ఘకాలంగా ఉత్పత్తి చేస్తున్న మోడల్‌గా పేరొందిన జిప్సీ ప్రయాణం నిలిచిపోయింది. జిప్సీ ఉత్పత్తిని నిలిపివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. షోరూంల్లో జిప్సీ బుకింగ్‌లను తీసుకోరాదని తన డీలర్లకు మారుతి సుజుకి అధికారికంగా సమాచారం అందించింది.

భారత విపణిలో 33ఏళ్ల క్రితం మారుతి సుజుకీ జిప్సీ అడుగుపెట్టింది. 1985లో రెండో తరం జిప్సీని మారుతి దేశీయ విపణిలోకి విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో జిమ్నీ పేరుతో ఈ ఎస్‌యూవీని తీసుకొచ్చారు. జిమ్నీలో మూడు, నాలుగో తరం మోడళ్లు వచ్చినా భారత్‌లో మాత్రం రెండో తరం జిప్సీ విక్రయాలే జరుగుతున్నాయి.

జిప్సీ డిజైన్‌, ఫీచర్లు ప్రస్తుత కర్బన ఉద్గార నిబంధనలను అందుకోలేక పోవడంతో ఈ ఎస్‌యూవీని నిలిపివేసేందుకు మారుతి నిర్ణయించింది. మన దేశంలో సాధారణ పౌరుల కంటే ఎక్కువగా సాయుధ బలగాలు, పోలీసులు ఈ వాహనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

కొత్త మోడళ్లు వస్తున్నా, జిప్సీనే ఐకానిక్‌ ఎస్‌యూవీగా పిలుస్తారు. అయితే కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో కొంతకాలంగా జిప్సీ విక్రయాలు తగ్గాయి. దీంతో ఆర్డర్ల ప్రాతిపదికన మాత్రమే ఈ ఎస్‌యూవీని మారుతి తయారుచేస్తోంది.
 
ఓపెన్ టాప్ 4x4 వాహనంగా ప్రయాణం మొదలైన జిప్సీ ధర రూ.6.22 లక్షల నుంచి ప్రారంభమైంది. హార్డ్ అండ్ సాఫ్ట్ టాప్ వేరియంట్ ఎస్‌యూవీ మోడల్‌గా ఉంది. భారత మార్కెట్‌లో మారుతి ఎస్ఎస్ 80 (మారుతి 800), మారుతి ఓమ్నీ మోడల్ కారు తర్వాత విడుదల చేసిన బ్రాండ్ వ్యాన్ జిప్సీ.
 

Follow Us:
Download App:
  • android
  • ios