బాలయ్య రాక సందర్బంగా నెల్లూరు పట్టణం  స్వాగత ఫ్లెక్సీలతో హోరెత్తింది. అన్ని ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనూ అభిమాన సంఘ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి అట్టహసంగా సభ నిర్వహించారు. సభ పూలవాన కురిపించినట్లే అసంతృప్తిని కూడా అంతే జోరుగు వెల్లడించింది. ఈ మొత్తం డ్రామా నిజంగా బాలయ్యసినిమా రిలీజు సందడిలాగే జరిగింది.  అందుకే టిడిపి నాయకులు చాలా  మంది ఇందులో పాల్గొన లేదు.

హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నెల్లూరు రాక విపరీతమయిన ‘సినిమా రిలీజు’ సందడి సృష్టించినా, టిడిపిలో ఉన్న అసంతృప్తి ని బయటపెట్టింది.

నుడా (నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ )చైర్మన్‌గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బాధ్యతలు స్వీకరించేకార్యక్రమానికి హాజరయ్యేందుకు బాలయ్య నెల్లూరు వచ్చారు. దీనికి కారణం శ్రీనివాసులు రెడ్డికి ఈ పదవి వచ్చింది బాలయ్య సిఫార్సు వల్లే. అందువల్ల బాలయ్య సమక్షంలోనే పదవి బాధ్యతలు స్వీకరిస్తానని అయన పట్టుబట్టి హీరో గారిని పిలిపించుకున్నారు.

 మొత్తం డ్రామాలో శ్రీనివాస రెడ్డి , ఆయన బృందం తప్పఎవ్వరికీ ఈ సంబరంలో చోటివ్వలేదు. ఆయన రాక సందర్బంగా నెల్లూరు పట్టణమంతా స్వాగత ఫ్లెక్సీలతో నగరాన్ని హోరెత్తించారు. అన్ని ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనూ అభిమాన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి అట్టహసంగా సభ నిర్వహించారు. అయితే సభ లోన పూలవాన కురిస్తే, బయటఅసంతృప్తి జోరుగా ప్రవహించింది.

ఈ మొత్తం డ్రామా నిజంగా బాలయ్యసినిమా రిలీజు సందడిలాగే జరిగింది. అందుకే టిడిపి నాయకులు చాలా మంది ఇందులో పాల్గొన లేదు.

ఎక్కడున్నా అందరినీ ఆకట్టుకునే ఆనం సోదరులు కనుచూపుమేరలో ఎక్కడ కనిపించలేదు.

వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితోపాటు నగర టీడీపీ కార్పొరేటర్లు సభకు దూరంగా ఉన్నారు. అఖిలభారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనురాధ, వారి వర్గం కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ అభిమాన సంఘ అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్‌ కూడా సభకు గైర్హాజరయ్యారు.

వచ్చిన వారు, మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మేయర్ అజీజ్ ఎమ్మెల్యేలు కె రామకృష్ణ, పాశం సునీల్ కుమార్ లే.