ఓ పంది ఇతన్ని కోటీశ్వరుడిని చేసింది.

First Published 5, Dec 2017, 5:25 PM IST
Man who found a pig gallstone when killing a sow discovers its worth 450000pounds
Highlights
  • ప్రతి రోజూ తిండి కోసం పనులు చేసుకునే అతను ఒక్కసారిగా మిలీనియర్ గా మారాడు

ఈ ఫోటోలో కినిపిస్తున్న వ్యక్తికి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ప్రతి రోజూ తిండి కోసం పనులు చేసుకునే అతను ఒక్కసారిగా మిలీనియర్ గా మారాడు. అది కూడా ఓ పంది కారణంగా. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

అసలు విషయం ఏమిటంటే.. చైనా లోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని ఓ గ్రామానికి చెందిన బో చున్లోవ్(51) అనే వ్యక్తికి ఒకరోజు గాల్ స్టోన్ దొరికింది. ఇతను పందులను చంపి.. ఆహారంగా తీసుకుంటుంటారు. అయితే.. ఒక రోజు బో చున్లోవ్ ఒక పందిని చంపగా.. అతనికి గాల్ స్టోన్ దొరికింది. పిత్తాశయంలో ఉండే రాయిని గాల్ స్టోన్ అంటారు. అది నాలుగు అంగుళాల పొడవు, 2.7 అంగుళాల వెడల్పు ఉంది.

చైనాలో గాల్ స్టోన్ ని మెడికల్ పర్పస్ కోసం వినియోగిస్తారు. ఇదే విషయాన్ని బో చున్లోవ్ కి గ్రామస్థులు తెలియజేశారు. దీంతో  అతను తన కుమారుడితో కలిసి షాంగాయ్ సిటీకి వెళ్లి  దానిని అమ్మాడు. కాగా అతనికి 450,000 పౌండ్లు లభించాయి. దాని విలువ అంతకన్నా ఎక్కువగానే ఉంటుదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ గాల్ స్టోన్ కారణంగా తన జీవితమే మారిపోయిందని బో చున్లోవ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

loader