నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..!

First Published 26, Mar 2018, 4:10 PM IST
Man's Reason For Applying To A Women's College? To Find A Girlfriend
Highlights
అమ్మాయిని లవ్ చేయడానికి ఉమెన్ యూనివర్శిటీలో చేరిన అబ్బాయి

అమ్మాయిల ప్రేమ దక్కించుకునేందుకు అబ్బాయిలు సాధ్యమైనంత వరకు ఏదైనా చేయడానికి వెనకాడరు. ఇక సినిమాల్లో అయితే.. వాళ్లు చేయలేనిది, సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అచ్చు సినిమాల్లో జరిగినట్టే ఒక వ్యక్తి నిజ జీవితంలోనూ జరిగింది. తన జీవితంలోకి అందమైన అమ్మాయిని ఆహ్వానించడం కోసం మహిళా యూనివర్శిటీలో చేరాడు ఓ కుర్రాడు.

మాములుగా అయితే.. మహిళా యూనివర్శిటీల్లో అబ్బాయిలకు చోటు ఉండదు. కానీ..సంవత్సరానికి ఓ అబ్బాయికి మాత్రం ఆ అవకాశం కల్పించే ఓ యూనివర్శిటీ ఉంది. ఆ ఒక్క సీటు కోసం వేలల్లో పోటీ పడుతుంటారు. కాగా.. ఆ యూనివర్శిటీలో ఎందుకు చదవాలనుకుంటున్నారో మాత్రం కచ్చితంగా చెప్పాలి. ఇంతకీ ఈ కథలో హీరో ఎందుకు చేరాలనుకుంటున్నావంటే.. ఏమని సమాధానం చెప్పాడో తెలుసా..? గర్ల్ ఫ్రెండ్ కోసం అని చెప్పాడు.  దీంతో ఇంటర్వ్యూ ప్యానెల్ కూడా మనోడి నికార్సయిన లక్ష్యానికి ఫిదా అయిపోయారు. ఇంకేముంది యూనివర్శిటీలో సీట్ ఖాయమైంది

 ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పనేలేదు కదా.. నా రాజధాని బీజింగ్‌లో ని చైనా ఉమెన్స్ యూనివర్సిటీలో. "ఈ కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. నేను గనుక ఇక్కడ చదివితే... ప్రేయసిని వెతుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో నా లైఫ్ సెటిల్ అవుతుంది.." అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు ఆ అబ్బాయి. ఇలాంటి కాలేజీ మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది కదూ.

loader