మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది. ఇందుకు నిదర్శనమే విశాఖలో జరిగిన తాజా సంఘటన.  నడిరోడ్డుపై ఓ కామంధుడు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్టేషన్ రోడ్డులో మతి స్థిమితంలేని మహిళలపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతుంటే.. స్థానికులు చూస్తూ ఉండిపోయారు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. మహిళను రక్షించాల్సింది పోయి.. కొందరు తమ మొబైల్ ఫోన్ లలో వీడియోలు తీశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టిస్తోంది. బాధితురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. బాధిత మహిళకు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరికాలేదని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.